నేత్ర పర్వంగా శ్రీ సూర్యనారాయణ మూర్తి,శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి కళ్యాణ మహోత్సవం
09-02-2025 08:21:19
నేత్ర పర్వంగా శ్రీ సూర్యనారాయణ మూర్తి,శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి కళ్యాణ మహోత్సవం
పెందుర్తి, ఫిబ్రవరి 8
చినముషిడివాడ దరినున్న వెంకటాద్రి ఘాట్ రోడ్డు పై వెలిసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయంలో శనివారం పద్మిని, ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి, మైత్రేయి, కాత్యాయని సమేత శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమూర్తులు రాపర్తి నరేంద్ర కుమార్ శర్మ నేతృత్వంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ యాజ్ఞవల్క్య పరిషత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదమంత్రాలు మంగళవాద్యాలు నడుమ గణపతి పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అంకురార్పణ, శుభ ముహూర్తం, మంగళసూత్రధారణ, సప్తపది, ప్రతి హోమం, నీరాజనం, మంత్రపుష్పం వంటి ఘట్టాలతో కమనీయంగా కళ్యాణం జరిపించారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు.సూర్యనారాయణమూర్తి, శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి కళ్యాణాలు తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో వదాన్యులు కేతవరపు గురుమూర్తి గుప్తా, వేద కుమారి దంపతులు, మేడపాటి కవిత లక్ష్మి, కృష్ణ షణ్ముఖ, నిఖిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో సంస్థ అధ్యక్షులు రాపర్తి కన్నా, కార్యదర్శి గంప చక్రవర్తి, పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు గంప గాయత్రి, బొల్లాప్రగడ సూర్యనారాయణ మూర్తి, ఆర్ సత్యదేవ్, మల్లెమడుగుల సూర్య నారాయణ మూర్తి, గంప రామకృష్ణ, తారణానందం తదితరులు పాల్గొన్నారు.