కన్నుల పండువగా టి.టి.డి ధర్మ ప్రచార పరిషత్ శోభాయాత్ర
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్ధానిక టి.టి.డి ధర్మప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వామివారి భక్తి చైతన్య శోభాయాత్ర కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. పి.ఎన్.కాలనీలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.మొత్తం 20 కోలాట బృందాలు, తప్పిటగుళ్ళు,చెక్కభజనల తాళం భజన మండలులు పాల్గొన్నాయి.ఆలయ ధర్మకర్త గురుగుబిల్లి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పుర ప్రముఖులు సమక్షంలో ప్రారంభమైంది.సామూహిక పారాయణలు నిర్వహించారు.
ఈ శోభాయాత్రలో నరసన్నపేట వాస్తవ్యురాలు వారణాసి సంతోషి, కోలాట బృంద ప్రతినిథి నీరజ, కోలాట బృంద ప్రతినిథి బాలకృష్ణ బృందం శ్రీ విఘ్నేశ్వర భజన బృందం,శ్రీకృష్ణ వేద పారాయణ బృందం,శ్రీ వేంకటేశ్వర కోలాట బృందం భారతీయ సంస్కృతి సేవ సమితి కోలాట బృందం, ఆశ్రితా కోలాట బృందం, పతివాడ పాలెం తప్పెట గుళ్ళు బృందం, అంబఖండి తప్పెటగుళ్ళు బృందం పలాస చెక్కభజన బృందం సభ్యులు పాల్గొన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సూపరింటెండెంట్ కాంతి కుమార్,ప్రోగ్రాం ఆర్గనైజర్ ఎం. లలితమణి డిపి స్టాఫ్ సిహెచ్ ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర ఏడు రోడ్ల కూడలి, పాత బస్టాండు,ముత్యాలమ్మ గుడి మీదుగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు జరిగింది.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సహకరించిన వారందరికీ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఎం.లలితమణి కృతజ్ఞతలు తెలిపారు.