Sidebar


Welcome to Vizag Express
టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి

09-02-2025 08:27:50

టెన్త్ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8

 టెన్త్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఎంఈఓ 2 ఎస్ విశ్వనాథం అన్నారు. శనివారం  ఇచ్చాపురం జి హెచ్ ఎస్, శాసనం, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు గణితం పై భయం పోయేలా పలు సూచనలు చేసి ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో మెలుకులు సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించి బిల్స్ అన్ని పీఎంశ్రీ యాప్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. పి శాసనం ఎంపీపీ ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు పాల్గొన్నారు.