10 టీవీ జర్నలిస్టుపై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలి
12-02-2025 15:45:41
10 టీవీ జర్నలిస్టుపై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలి
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,08: జర్నలిస్టుపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంఘం ముంచంగిపుట్టు మండల బాడీ (ఏపీటిఆర్ఎ) తీవ్రంగా ఖండించింది. సంధర్భంగా శనివారం ఏపీటిఆర్ఎ మండల బాడి సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల పాడేరు 10టీవీ విలేఖరి మత్స్యలింగం వార్త సేకరణకు వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గాసడి వెంకటరావు చిందులు వేస్తూ భౌతికంగా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తూ, నోటికి వచ్చినట్టు దురుసు మాటలతో వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులపై అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. దీనిని ముంచంగిపుట్టు గిరిజన విలేకరుల సంఘం మండల బాడీ తీవ్రంగా ఖండిస్తున్నాం. విలేకరులపై దురుసుగా వ్యవహరించిన జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ అప్ సర్వేయర్ వెంకట్రావు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముంచంగిపుట్టు గిరిజన విలేకరుల సంఘం మండల బాడీ అధ్యక్షుడు ఆర్ నాగభూషణ్, కార్యదర్శి కూడ మోహన్, గౌరవ అధ్యక్షులు కాంతరి మోహన్, పాంగి భాస్కరరావు, ఎస్ శంకర్రావు, జి కోటేశ్వరరావు, కే అనిల్ కుమార్, కే ఈశ్వరరావు, కే రాంబాబు, పి పులిరాజు లు డిమాండ్ చేశారు.