రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ కు వైసిపి సంపూర్ణ మద్దతు
12-02-2025 15:58:22
రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ కు వైసిపి సంపూర్ణ మద్దతు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,10: రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ కు అఖిలపక్ష ప్రజా సంఘాలు పిలుపును మండల వైఎస్ఆర్సిపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అన్నారు. మండల కేంద్రంలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి 1/70 చట్టం పై 11,12 తేదీలలో జరుగు రాష్ట్ర మన్యం బంధ్ పై గిరిచర్చించారు.ఈ సందర్భంగా అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరించాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 1/70 చట్టం పరిరక్షణకు ఫిబ్రవరి 11,12 తేదీల్లో అఖిల పక్ష ప్రజా సంఘాలు పిలుపుచ్చిన 48 గంటల రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ను వైసిపి సంపూర్ణంగా మద్దతు తెలుపు తుందన్నారు. టూరిజం అభివృద్ధికి 1/70 చట్టం అడ్డంగా ఉందని, చట్ట సవరణ చేయాలని అయ్యన్న వ్యాఖ్యలు చెయ్యడం పట్ల కూటమి ప్రభుత్వ విధానం ఎంటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 1/70 చట్టం అమల్లో ఉండగానే గిరిజన ప్రాంతంలో బినామిల పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ లు, రిసార్ట్స్, లాడ్జిలు యాదేచ్చాగా నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇక చట్టాన్ని సవరిస్తే గిరిజనుల భూములు, అడవులు, గిరిజన ప్రాంతం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయుటకు గిరిజన సంఘం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్త బంద్ కు యువత, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్ వి కొండలరావు, సర్పంచుల పోరం అధ్యక్షులు, వి రమేష్, బాబురావు, ఎంపీటీసీ, గణపతి, నేతలు, దాసు, ధనుర్జాయ్, సురేష్, బాలరాజు, త్రినాధులతోపాటు తదితరులు పాల్గొన్నారు.