క్రీడలతో మానసిక ఉల్లాసం
గంగా దేవత పండుగ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన
స్థానిక ఎస్సై జె రామకృష్ణ
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,10: యువత క్రీడలు ఆడటంతోనే మానసిక ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటామని స్థానిక ఎస్సై జె రామకృష్ణ అన్నారు. శ్రీశ్రీశ్రీ గంగా దేవత పండుగలు పురస్కరించుకొని మండలంలో గల కిలగాడ పంచాయితీ కేంద్రం గా ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం ఎస్సై జె రామకృష్ణ, కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేష్ ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ నేటి కంప్యూటర్ యుగంలో కల్చరల్ యాక్టివిటీస్ కు యువతి యువకులు చాలా దూరంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కడైనా కూడా చిన్నచిన్న గొడవలు వర్గ విభేదాలు తప్ప కలిసికట్టుగా కల్చరల్ ఆక్టివిటీస్ చేసేందుకు ముందుకు రావటం లేదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామాల్లో ప్రజలకు యువతి యువకులకు మనమందరం ఒకటే అనే భావన వర్గ బేధాలు మనస్పార్ధాలు లేకుండా ఉంటాయన్నారు. గంగా దేవత ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ ఉత్సవ కమిటీ జాగ్రత్త వహించాలన్నారు. టోర్నమెంట్ కు సంబంధించి ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గెలిచిన టీం సభ్యులకు ఆలయ ఉత్సవ కమిటీ అందజేస్తుందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్లో పెదబయలు ముంచింగిపుట్టు మండల పరిధిలోగల 60 క్రికెట్ టీంలు పోటీలో పాల్గొంటున్నారని ఆలయ ఉత్సవ కమిటీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శివశంకర్, ఆలయ కమిటీ చైర్మన్ రాంప్రసాద్, గ్రామ పెద్దలు, అంబిడి రామానుజులు,ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, సురేష్, నర్సింగ్ మూర్తి, రవి, చంటి, స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు