Sidebar


Welcome to Vizag Express
నులిపురుగుల మాత్రతో పిల్లలకు ఆరోగ్య భవిష్యత్

12-02-2025 16:00:10

నులిపురుగుల మాత్రతో పిల్లలకు ఆరోగ్య భవిష్యత్

ముంచంగిపుట్టు,వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,10: నులిపురుగుల మాత్రలు వేయించడంతో పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు ను అందించగలమని వైద్యాధికారిని శిరీష అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కిలగాడ ప్రాథమిక వైద్యాధికారిణి పి శిరీష ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల కేజీబీవీ బాలికల పాఠశాల కిలగాడ, ప్రభుత్వ పాఠశాలలు, ఎంపీపీ, ఎంపీయుపి, ప్రభుత్వ హాస్టల్, జూనియర్ కళాశాల, గ్రామస్థాయిలో అంగన్వాడి కేంద్రాలలో, పిల్లలందరికి నులిపురుగుల మందును అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 సంవత్సరం వయస్సు నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ జాతీయ నులిపురుగుల మాత్రలు అందించడం జరిగిందన్నారు. సుమారుగా5024 విద్యార్థులకు మాత్రలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మరిగించిన నీరును త్రాగాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.  గ్రామస్థాయిలో  అంగన్వాడి కేంద్రాల్లో  ఆరోగ్య సమస్యలు రాకుండా అంగన్వాడి పిల్లలకు అంగన్వాడి కార్యకర్తల ద్వారా వేయించడం జరిగింద అన్నారు.  క్రమం తప్పకుండా సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాలన్నారు. దీంతో కడుపులో ఉన్న నులిపురుగులు, కొంకపురుగులు, ఏలిక పాములు, చనిపోతాయన్నారు. ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈనెల 17వ తారీఖున మరల అందుబాటులో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి కే సుబ్రహ్మణ్యం, ఆరోగ్య విస్తరణ అధికారి బి కృష్ణవేణి, హెల్త్ సూపర్వైజర్ సిహెచ్ వేదవతి, హెల్త్ సూపర్వైజర్ ఎస్ లలితమ్మ మోహన్ రావు, నాగరాజు, తులసి, రత్నం ,కాంతమ్మ, అశోక్ కుమార్, రోషిని మహేష్ తదితరులు పాల్గొన్నారు.