ఘనంగా నల్లమారెమ్మవారి పండుగ
12-02-2025 16:02:22
ఘనంగా నల్లమారెమ్మవారి పండుగ
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 11:
నియోజకవర్గంలో గల అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ నల్లమారెమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శోభాయాత్ర సాగుతూ భక్తుల ప్రదక్షిణలు, కీర్తనలతో కడు రమణీయంగా సాగింది.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, కుంభాభిషేకం, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా నునపర్తి గ్రామ టీడీపీ నాయకులు ఆర్.వి.వి. నాగేష్ మాట్లాడుతూ నల్ల మారమ్మ అమ్మవారి కృపతో మన గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. గ్రామ పెద్దలు, యువత, భక్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.