భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు-డిఐజి
12-02-2025 16:04:58
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు-డిఐజి
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 11:
మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి,జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్,అచ్యుతాపురం, రాంబిల్లి పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు జాగరణ చేసి సముద్ర తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి సమీపంలో ఆలయాలను సందర్శించుకునే సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసులు మెరైన్ పోలీసులు,భక్తుల భద్రత, బందోబస్తు విధులు, వాహనాలు పార్కింగ్ తదితర అంశాలపై గూర్చి అధికారులు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. గజ ఈతగాళ్లను, బోట్లను ఏర్పాటు చేసి పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా ప్రజల భద్రతకు హెచ్చరికలు జారీ చేయడం, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ద్వారా పర్యవేక్షించాలన్నారు. సంస్కృతిక కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, అచ్యుతాపురం ఇన్స్పెక్టర్ నమ్మి గణేష్, రాంబిల్లి ఇన్స్పెక్టర్ సి.హెచ్.నర్సింగరావు, పూడిమడక మెరైన్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.