Sidebar


Welcome to Vizag Express
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

12-02-2025 16:05:24

క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి 
ఐసిడిఎస్ పిఓ గౌరీ 

 గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 11: 
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని క్యాన్సర్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఐసిడిఎస్ పిఓ గౌరీ పేర్కొన్నారు. మంగళవారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్ పురం గ్రామంలో క్యాన్సర్ పై అవగాహన నిర్వహించారు. గౌరీ మాట్లాడుతూ క్యాన్సర్ను ఆదిలోనే  గుర్తించడం ద్వారా వేగవంతంగా నయం చేసుకోవచ్చని చెప్పారు. క్యాన్సర్ పై అవగాహన తెచ్చుకొని అనుమానం వచ్చినట్లయితే డాక్టర్లను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపిఎం కరుణానిధి, సూపర్వైజర్ సత్య, వైద్య సిబ్బంది అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..