25-01-2025 21:42:50
అథ్లెటిక్స్ లో యలమంచిలి విద్యార్థికి గోల్డ్ మెడల్ యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బి ఎ విద్యార్థి ఎం.టి.నారాయణ్ నాయక్ కు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సీఎం-కప్ అథ్లెటిక్స్ విభాగం 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 వేల రూపాయల నగదు బహుమతి, సర్టిఫికెట్ అందుకున్నాడు.ఈ సందర్భంగా శనివారం నారాయణ్ ను, శిక్షణనిచ్చిన కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై.పోలిరెడ్డిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తో పాటుగా,కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.