25-01-2025 22:04:40
ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులచె ర్యాలీకంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 25:జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం కంచిలి మండల తహసిల్దార్ ఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో తమ కార్యాలయం నుండి మెయిన్ రోడ్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారంగా ఏర్పడి 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు తమ యొక్క ఓటు నమోదు చేసుకునే విధంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి రమేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకావాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఉద్యోగులు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్ధులు పాల్గొన్నారు.