26-01-2025 18:26:16
చీపురుపల్లి, వైజాగ్ ఎక్సప్రెస్ న్యూస్ జనవరి 26: ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని చీపురుపల్లి జూనియర్ సివిల్ జడ్జి వై ప్రేమలత అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం చీపురుపల్లి జూనియర్స్ జడ్జి కోర్టు ప్రాంగణమునందు ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య ము సమకూరింది అన్నారు.. రెండు శతాబ్దాలకు పైగా బ్రిటీష్వారి చెరలో మగ్గిన మనకు ఎందరో మహానుభావుల త్యాగఫలంతో ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం సిద్ధించింది అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటీషు వారు అందించిన చట్టంను పక్కనపెట్టి సొంతంగా భారత్కు ప్రత్యేక రాజ్యాంగం తీసుకొచ్చారు అన్నారు. స్వేచ్ఛను సాధించిన భారతావని స్వీయ నిర్ణయాలకు సిద్ధం చేసుకున్న రాజ్యాంగాన్ని అమలుచేసి సర్వసత్తాక, సార్వభౌమ రాజ్యంగా మారిన రోజున యావత్ భారతావని అంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు ఆ త్యాగదనుల ఆశయసాధనకు కృషి చేద్దామని అని అన్నారు.. స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ ఎన్ రాజారావు. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద సబ్ రిజిస్టర్ తవిటి నాయుడు చీపురుపల్లి సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ శంకర్రావు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇంచార్జ్ ఎంపీడీవో సురేష్, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పరిషత్ ఉన్నత పాఠశాలల వద్ద ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిఎంసి బాలయోగి రెసిడెన్షియల్ కళాశాల యందు ప్రిన్సిపాల్ అలాగే ప్రాథమిక పాఠశాలల వద్ద ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు... చీపురుపల్లి మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.. ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డిఓ సత్యవేణి ప్జెండా ను ఎగురవేశారు.