27-01-2025 20:55:45
కళాకారుడు ప్రేమ్ కుమార్ కు సన్మానం !సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 27:సీనియర్ డోలక్ కళాకారుడు తెలుకుల ప్రేమ్ కుమార్ కు బారువాలో ఆదివారం రాత్రి సన్మానం జరిగింది. తెలుకుల మంగమ్మ కుమారులు తిరుపతిరావు ఆధ్వర్యంలో మండల కళాకారులతో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా కళాకారులు ప్రేమ్ కుమార్ కు సన్మానిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. దశాబ్ద కలంగా డోలక్ వాయిస్తూ ఆంధ్ర ,ఒరిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో గుర్తుకు పొందిన ప్రేమ్ కుమార్ కు సన్మానం పట్ల పలువురు కళాకారులు దాసరి చంద్రశేఖర్, జానపద కళాకారులు డాక్టర్ కుమార్ నాయక్ ,నల్ల కుమారస్వామి తదితరులు అభినందించారు