శెట్టి బలిజ కులస్తులకు కేటాయించిన మద్యం షాపులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 28:
అనకాపల్లి జిల్లా గొలుగొండ,నాతవరం ఎక్సైజ్ & ప్రొహిబిషన్ సర్కిల్ పరిధిలో శెట్టి బలిజ కులస్తులకు రెండు మండలాలు సంబంధించి ప్రభుత్వం ఒక మద్యం షాపు కేటాయించిందని కావున శెట్టి బలిజ కులస్తులు ఫిబ్రవరి 5 తేదీ సాయంత్రం 5 గంటలు లోపు ఆన్ లైన్ ద్వారా కానీ లేదా గొలుగొండ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ కార్యాలయంలో నేరుగా కానీ దరఖాస్తు అందజేయాలని దరఖాస్తు చేసుకునే వారు అనకాపల్లి జిల్లా కి చెంది శెట్టి బలిజ కులస్తులు మాత్రమే తప్పని సరిగా కుల ధృవీకరణ పత్రం నివాస ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఎక్సైజ్ &ప్రొహిబిషన్ సీఐ వి రామకృష్ణ తెలిపారు