Sidebar


Welcome to Vizag Express
మార్చి 3,4 తేదీల్లో గంగమ్మ తల్లి జాతర

29-01-2025 21:19:18

మార్చి 3,4 తేదీల్లో గంగమ్మ తల్లి జాతర 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి:29: మండలంలో సుజనకోట కేంద్రంగా ప్రతి ఏటా నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ తేదీలను బుధవారం ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం చేశారు మార్చి 3,4 తేదీలను ఖరారు చేశారు. ఈ సమావేశమునకు స్థానిక సర్పంచ్ వి రమేష్  అధ్యక్షత వహించారు. ప్రతి ఏటా జరుపుకునే విధంగా అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో మహోత్సవాలు నిర్వహించాలని సమావేశంలో మాట్లాడుకున్నారు. అమ్మవారి జాతరలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలవకుండా విధివిధానాలను అనుసరించి పండుగను విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ బాధ్యత వహించాలన్నారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహణ కార్యదర్శిగా సమరెడ్డి బాలగంగాధర్ తిలక్ కు సుజన కోట గ్రామస్తులు దుస్వాలుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సమ్మరెడ్డి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి వెంగడ నీలకంఠం, వైస్ ప్రెసిడెంట్ వి నాని బాబు, టిడిపి మండల అధ్యక్షులు బలరాం , ఈ విషయంతో పాటు వి సదానందం, ఎస్ ధర్మారావు, ఎం నాగేశ్వరరావు, కే దామోదరం, ఎం త్రినాధరావు, తదితరులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.