29-01-2025 21:33:38
ఆగని ఇసుక దందా! వారి పై చర్యలు ఎక్కడ?పి.గన్నవరం, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 29:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, పెదపట్నం, అప్పనపల్లి, లో ఉచిత ఇసుక పేరుతో కొందరు ధనార్జనే ధ్యేయంగా బోట్ రీచ్ నిర్వహిస్తున్నారు.ఉమ్మడి కూటమికి చెందిన ఒక మండల అధ్యక్షుడు కను సైగలు తో ఇసుక దందా నిర్వహిస్తున్నారు. దానికి తోడు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అండదండలతో కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు బహిరంగ విమర్శలు వెలువడుతున్నాయి. స్థానిక తాసిల్దార్ వై.వి.సుబ్రహ్మణ్య చారి వారిని వివరణ కోరగా మండల పరిధిలో ఎక్కడ ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వలేదని, అనధికార ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.