29-01-2025 22:31:43
వలస కూలీల పిల్లలను బడిలో చేర్పించండి ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29 ఇటుకల పరిశ్రమలో పనిచేస్తున్న వలస కూలీల పిల్లల చదువు కోసం అన్ని సెంటర్లు వద్ద చదువు చెప్పేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఇటుకల పరిశ్రమల యజమానులకు ఎంఈఓ అప్పారావు,ఏఎల్ఎస్సీఓ సమగ్ర శిక్ష పి జనార్దన్ రావు సూచించారు. బుధవారం జిల్లా టాస్క్ ఫోర్స్ టీం మండలంలో అన్ని ఇటుకల పరిశ్రమలను సందర్శించి చదువులకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల కోసం ఎన్ఆర్ఎస్టిసి సెంటర్ల ఏర్పాటుకు ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ ఎం. విజయకుమార్, బ్రేడ్స్ కేఎస్సీఎఫ్ కోఆర్డినేటర్ మరియు సీఆర్ ఎంటిలు తులసిరావు, సత్యనారాయణ పాల్గొన్నారు