కేసరిపడలో ఉచిత పశువైద్య శిబిరం
కంచిలి వైజాగ్ ప్రెస్ జనవరి 30:
మండలం కేశరపడ గ్రామంలో మండల వైద్య అధికారిని డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన పాడి రైతులకు పశువుల యొక్క సెక్స శార్టెడ్ సిమన్ ప్రముఖ్యత,పాడి పశువుల పోషణలో మెళకువలు గురించి రైతులకు వివరించడం జరిగింది.42 దూడలకు ఏలిక పాముల నివారణ మందులు, 14 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, సుమారు 130 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వెయ్యడం జరిగింది. ఈ పశువు వైద్య శిబిరాల ద్వారా పాడ రైతులు తమ యొక్క పాడి పరిశ్రమను ఆరోగ్యవంతంగా చూసుకోవడానికి ఎంతో మేలుగా ఉంటుందని దీన్ని పాడి రైతులకు సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ శిరీష రైతులను కోరారు.
కార్యక్రమంలో గ్రామపెద్దలు, సిబ్బంది రాజేష్, వినోద్,రబియా, సాయి తదితరులు పాల్గొన్నారు.