Sidebar


Welcome to Vizag Express
తక్షణమే పాఠశాలల విలీనం ఆపాలి

30-01-2025 19:22:25

తక్షణమే పాఠశాలల విలీనం ఆపాలి

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 30: 

కంచిలి మండలం నారాయణ బట్టి ఎంపీపీ పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులను ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టదలచిన విలీనాలకి తక్షణమే నిలిపివేయాలని నారాయణబట్టి గ్రామస్తులు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి విద్యాశాఖ అధికారి శివరాంప్రసాద్ కి వినత పత్రం అందజేశారు. తమ గ్రామంలోనే ఇప్పుడున్న పద్ధతుల్ని అవలంబిస్తూ ఒకటి నుండి ఐదు తరగతులను కొనసాగించాలని ఆ శాఖ అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ బట్టి గ్రామం లో గల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేశారు.