30-01-2025 19:25:53
సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎండిఓ తిరుమల రావుకంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 30: మండలంలోని డిజిపురం ఎంఎస్ పల్లి కోలేరు గ్రామ సచివాలయాలను మండల అభివృద్ధి అధికారి తిరుమలరావు ఆకస్మకతానికి చేశారు. తనిఖీలలో భాగంగా సచివాలయ ఉద్యోగులు యొక్క హాజరు పట్టిలను పరిశీలిస్తూ సక్రమంగా విధులకు హాజరై ప్రజలకు పౌరు సేవలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఉద్యోగులకు హెచ్చరించడం జరిగింది. డిజిపురం ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా భోజనాలను పరిశీలిస్తూ విద్యార్థులకు భోజనం నాణ్యత కోసం అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి అధికారి తిరుమల రావు తో పాటు ఏపీఓ ధనంజయరావు వివిధ అధికారులు పాల్గొన్నారు.