Sidebar


Welcome to Vizag Express
కమ్మసిగడ జాతర ఏర్పాట్లు పరిసిన

30-01-2025 19:28:01

కమ్మసిగడ  జాతర ఏర్పాట్లు పరిసిన 

 రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30
  


కమ్మసిగడాంలో ఫిబ్రవరి 7 నుంచి మూడురోజులు జరిగే శ్రీ మహాలక్ష్మీతల్లి జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జె.ఆర్.పురం సీఐ ఎం. అవతారం, ఎస్.ఐ ఎస్. చిరంజీవి జాతర స్థలాన్ని పరిశీలించారు పార్కింగ్ స్థలం, తదితర విషయాలు కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు వెలిచేటి రామకృష్ణ, కోశాధికారి వెలిచేటి రాజశేఖర్, సభ్యులు గురాల రఘనాధ్ ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు