Sidebar


Welcome to Vizag Express
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

30-01-2025 19:34:33

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30

 విద్యార్థులు సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్సై శ్రీనివాసరావు అన్నారు. మండపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి వాటి పట్ల కూడా అప్రమత్తత అవసరమని అన్నారు. గంజాయి వంటి మధకద్రవ్యాల బారిన  పడకుండా ఉండాలని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.