Sidebar


Welcome to Vizag Express
బాల బ్రహ్మానంద సరస్వతి ఆశ్రమంలో హిందూ ధార్మిక సభ

30-01-2025 19:36:06

బాల బ్రహ్మానంద సరస్వతి ఆశ్రమంలో హిందూ ధార్మిక సభ 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30

 హిందూ ధర్మాన్ని సమ సమాజ స్థాపన కోసం హిందూ ధార్మిక సేవాసమితి వ్యవస్థాపకులు బాల బ్రహ్మానంద సరస్వతి చేస్తున్న చిరు ప్రయత్నం అభినందనీయమని ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. గురువారం పాతాళ సిద్దేశ్వర ఆలయ సమీపంలో గల ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో వారాహి యాగం, హిందూ ధార్మిక సభ ఘనంగా జరిగింది. పూర్ణ కళాశాలతో పండితులు మహిళలు విప్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. హిందూ ధర్మం మతం కాదు అది ఒక జీవన విధానం అని అన్నారు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన ఘనత మన భారతదేశం అని అన్నారు. అనంతరం పల్లీలు మధ్య స్వామీజీలు ఎమ్మెల్యేకు ఆశీస్సులు తీసుకున్నారు. 15 మంది పీఠాధిపతులతో వేద ఆశీర్వచన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హరిద్వార్, చిన్మయ మిషన్, పూరి, విజయనగరం, చీపురుపల్లి, లైదాం, పొందూరు, భువనేశ్వర్, జ్ఞానపీఠం, మిస్ కాల్ పీఠాధిపతులు, పట్టణ అధ్యక్షులు , కార్యదర్శులు టిడిపి పార్టీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల జయదేవ్, టిడిపి నాయకులు డి  ఢిల్లీ రావు, సహదేవ రెడ్డి, బి కృష్ణయ్య, పద్మనాభం, లీలారాణి, ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.