Sidebar


Welcome to Vizag Express
అనూషకు అభినందించిన ప్రిన్సిపాల్ అంబటి

30-01-2025 19:37:43

అనూషకు అభినందించిన ప్రిన్సిపాల్ అంబటి

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 30:

 సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పొందర అనూష పాత్రో   ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్  పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు(439/470) సాధించినందుకు (బాలికను రక్షించు బాలికను చదివించు) పథకం కింద భేటీ బచావో బేటి పడావో పథకం కింద  ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి మోహనరావు అభినందించారు. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ , డిఇఓ చేతుల మీదుగా నగదు బహుమతి మొమెంటో అందుకోవడం కళాశాలకే  గర్వకారణం అన్నారు. అనూషను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని కళాశాలకు  పేరు తేవాలని పేర్కొన్నారు.జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎంఓ రజిని కుమారి గారు ,ఎన్ఎస్ఎస్  పి ఓ లు ఏ రామి నాయుడు గారు ,ఎం .ప్రసాద్ ఇతర అధ్యాపకులు  విద్యార్థులు.విద్యార్థులు పాల్గొన్నారు