భూములు కోల్పోయిన మాకు ఇస్తామన్న ఇండ్లు ఇవ్వండి. --కే వి పి ఎస్. డిమాండ్. చిన గదిలి రూరల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా.
మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ :
మాకుఇస్తామన్న ఇండ్లు ఇవ్వక పోవడం అన్యాయమని,ఇంకా యెన్నాళ్ళు తిప్పుతారని భూములు కోల్పోయిన రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం విశాఖ రూరల్ మండలం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కే వి పి ఎస్)జిల్లా ఉపాధ్యక్షులు,భూములు కోల్పోయిన రైతుల ప్రతినిధి సియ్యాద్రి పైడితల్లి మాట్లాడుతూ కొమ్మాది,బక్కన్న పాలెం, రేవల్లు పాలెం రైతులకు సుమారు 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను,ఏటువంటి నష్ట పరిహారం ఇవ్వకుండా అభివృద్ధి పేరుతో తీసుకున్నారని తెలియ చేసారు.అన్యాయానికి,ఆర్థిక నష్టానికి గురి చేసిన అధికారులు,అధికార,ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు చివరకు రైతుల భూములలో నిర్మించిన ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని తెలియ చేసారు.వయసులో పెద్దవాల్లమని కూడా చూడకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకపై మాకు ఇస్తామన్న ఇండ్లు ఇవ్వక పోతే,కార్యాలయం వద్ద నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సి ఐ టీ యు నాయకులు డి అప్పలరాజు,రైతులు ఎస్ సోమలమ్మ,అర్జునరావు, ఎస్ అప్పారావు,పైదమ్మ, ఎస్ బంగార్రాజు,కే గౌరమ్మ,తదితరులు పాల్గొన్నారు..