బాపూజీ కళామందిర్ లో మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు
మధురవాడ వైజాగ్ ఎక్స్ప్రెస్ :
విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద జాతీయ నాయకుల విగ్రహాలలో ఒకటైన మహాత్మా గాంధీ విగ్రహానికి చంద్రంపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిళ్లా సూరిబాబు, వైయస్సార్ కాంగ్రెసు నాయకులు పి.వి.జి.అప్పారావు, పిళ్లా చంద్రశేఖర్, జగుపిల్లి నరేష్, పోతిన పైడిరాజు, పిళ్లా అప్పన్న, పిళ్లా పోతరాజు, పీస రామారావు, పోతిన శివ, దుక్క వరం, పోతిన కనకరావు, పిళ్లా అప్పారావు, బొల్లు అప్పారావు, పిళ్లా రాజు, కె.అప్పారావు, డి.అప్పారావు
జనసేన నాయకులు పిళ్లా శ్రీను, జగుపిల్లి నాని, యస్.సతీష్ తదితరులు పూల మాలలు, పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ గారు ముందుండి అహింసా మార్గంలో పోరాటం చేసి స్వాతంత్ర్యం సాదించారని కొనియాడారు, గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరూ పాట పాడాలని పిలుపునిచ్చాను