కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన కోరాడ రాజబాబు
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 30.
సింహాచలం లో పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు,
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఎన్నో సంవత్సరాలుగా మొండి సమస్యగా ఉన్న పంచ గ్రామాల భూ సమస్యని గత వైయస్సార్ సిపి ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ సమస్యను యువగళం పాదయాత్ర లో యువగళం పాదయాత్ర రూపకర్త తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి ,ఐటి ,ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు కి బాధితులను పాదయాత్రలో కల్పించి సమస్యను వారి దృష్టిలో పెట్టగా వారు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ఎన్నికల హామీగా చేర్చి సత్వరం సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయడం చాలా ఆనందదాయకం అని సమస్యను ఆయన దృష్టిలో పెట్టి పరిష్కారం దిశగా తీసుకురావడంలో సఫలం కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలియజేస్తూ సమస్య పరిష్కారం మార్గంలో ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఇరుపక్షాల వారు కోర్టు కేసులను రద్దు చేసుకునేలా ఒప్పించి దేవస్థానం ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు ని ఒప్పించి 92000 కుటుంబాలకు ఊరట కలిగిస్తూ 12149 ఇళ్ళను క్రమబద్ధీకరిస్తూ దేవస్థానం కోల్పోయిన 420 ఎకరాల భూమికి బదులు అంతే విలువ చేసే 610 ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకరించిన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ కి, సమస్యను సత్వర పరిష్కారం దిశగా నడిపిన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు వారికి, రెవెన్యూ మంత్రి కి ,కూటమి ఎంపీ లు మరియు జిల్లా ఎమ్మెల్యే లకు సమస్య పరిష్కారం కొరకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు