జాతిపిత మహాత్మ గాంధీ ఘన నివాళులు అర్పించిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ రావు
ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 30.
ఆనందపురం వేములవలస గ్రామపంచాయతీలో ఉన్న ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వరరావు, సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి భారతజాతికి స్వేచ్ఛ స్వతంత్రియాలను అందించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని వేములవలస పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అన్నారు. స్థానిక ఎంపీపీ పాఠశాలలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు అందించిన త్యాగశీలిగా అభివర్ణించారు. హింసా మార్గాన్ని ప్రేరేపించకుండా జాతిపిత గాంధీ అడుగజాడల్లో అందరూ నడుచుకోవాలని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుభాషిణి, టీచర్ కె. ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.