Sidebar


Welcome to Vizag Express
దీక్షా శిబిరం సందర్శించిన ఉక్కు కేంద్రమంత్రి

30-01-2025 20:16:41

దీక్షా శిబిరం సందర్శించిన ఉక్కు కేంద్రమంత్రి 
 గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30
1449, వ రోజు రిలే నిరాహార దీక్షలో యూనియన్ యూనియన్ నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు,

5,నిమిషాల పాటు దీక్షా శిబిరాన్ని తదేకంగా చూసిన కేంద్ర ఉక్కుమంత్రి, కుమారస్వామి,

ఈరోజు ఉక్కు పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కూర్మానుపాలం ప్రధాన కూడలిలో కొంతసేపు ఆగింది.  కూటమి కార్యకర్తలు అభినందనలు తెలిపేందుకు కాన్వాయ్ ని దీక్ష శిబిరం ఎదురుగా 15 నిమిషాల పాటు ఆపారు.
పోరాట కమిటీ సభ్యులు శిబిరంలో నిలబడి ప్లాంటును ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తున్నట్లు ప్రధాని పర్యటన చేయాలని, సొంత గనులు కేటాయించాలని,
విశాఖ ఉక్కు కి ప్యాకేజీ ప్రకటించిన ఉక్కు మంత్రి 
పర్యటనను స్వాగతిస్తాం,

విశాఖ ఉక్కు రక్షణకై శాశ్వత పరిష్కారం కల్పించండి,
 ప్యాకేజ్ శాశ్వత పరిష్కారం కాదు, అక్క
100% వ్యూహాత్మక అమ్మకాన్ని ఆపాలి,
సెయిల్ లో విలీనం చేయాలి,
సొంతగనులు కేటాయించాలి,
ఉద్యోగుల కుదింపు ఆపాలి, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి,
4 సం||టాక్స్ హాలిడే ప్రకటించాలి ,,
ఉక్కు భూములు బదలాయించాలి,


2021 జనవరి 27 నుండి కేంద్ర ప్రభుత్వ విధ్వంసకర.ఆంక్షలు, ఇప్పటికైనా ఆపాలి ఆపాలి,,
ఉమ్మడితెలుగు రాష్ట్రాల ప్రజల హక్కు విశాఖ ఉక్కు,
 అని పెద్ద ఎత్తున దిక్కులు పిక్కటిల్లెల నినాదాలు చేశారు.
     తెలుగు భాష పట్ల అవగాహన కలిగిన కేంద్ర మంత్రి దీక్ష శిబిరంలో నినాదాలు చేస్తున్న వారిని అనేకసార్లు పరిశీలనగా చూశారు.
కేంద్ర మంత్రి తో పాటు స్టీల్ సహాయం మంత్రి, శ్రీనివాస్ వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , విశాఖ ఎంపీ భరత్, తదితరులు కేంద్ర మంత్రి తో పాటు కాన్వాయ్ లో వచ్చారు.
  ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, వరషాల శ్రీనివాసరావు, రామారావు,  వెంకటేశ్వరరావు,మసేను రావు, ట్రిప్ట్ మూర్తి, ప్రసాద్, సిహెచ్ సన్యాసిరావు, డేవిడ్, దాసరి శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు,