ఉక్కు కేంద్రమంత్రికి గాజువాకలో ఘన స్వాగతం
30-01-2025 20:18:16
ఉక్కు కేంద్రమంత్రికి గాజువాకలో ఘన స్వాగతం గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30, కేంద్రమంత్రి కుమారస్వామికి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి పాత గాజువాకలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సారధ్యంలో ఘన స్వాగతం పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సుమారు 11 వేల 44 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి, టిడిపి, బిజెపి జనసేన ఫ్లాకార్డులు జండాలతో నినాదాలతో స్వాగతం పలికారు. మంత్రులకు పూల వర్షం కురిపించారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, ముడి సరుకు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాన్వాయ్ కూర్మన్నపాలెం దీక్షాశిపురం మీదుగా స్టీల్ ప్లాంట్ లో సమావేశానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్. అనకాపల్లి ఎంపీ రమేష్ టిడిపి, బిజెపి, కరణం రెడ్డి నర్సింగరావు, కోన తాతారావు, గోవింద్ రెడ్డి, ప్రసాదుల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, వాసు, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏసిపి త్రినాథ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.