వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహాభిషేకం పంచామృత అభిషేకాలు
30-01-2025 20:19:31
వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహాభిషేకం పంచామృత అభిషేకాలు
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30 జీవీఎంసీ 65 వ వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం(స్వామివారి జన్మ నక్షత్రం)పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి దంపతులిచే మహాభిషేకం పంచామృత అభిషేకలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం(శ్రవణ) నాడు స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కోరాడ రామకృష్ణ సుజాత హాజరయ్యారు.స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలు కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ముప్పిరాల ప్రదీప్ చంద్ర, తాత ఆచార్యులుచే మహాభిషేకం నిర్వహించడం జరిగినది. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా స్వామివారి ప్రత్యేక అభిషేకలు దర్శనాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమంత్ కొండలరావు, ఆడారి సూరిబాబు, ఉషారాణి, గొరుసు రామలక్ష్మి, కె. నాగమణి, జి. పద్మావతి, చాముండేశ్వరి, పండూరి సత్యవతి, శరగడం సావిత్రమ్మ ,చిట్టెమ్మ,మంగమ్మ,హిమ్మాజా,లత, భవనమ్మ్, రామ, పైడితల్లి బుజ్జి , లక్ష్మి ,కళ గౌరి, రూపదేవి , s. సావిత్రి, దుర్గ, పద్మ తదితరులు పాల్గొన్నారు.