Sidebar


Welcome to Vizag Express
హౌసింగ్ బోర్డు కాలనీ లో..పది కోట్ల రూపాయలతో పార్కు అభివృద్ధి పార్కు పనులను పరిశీలించిన జీవీఎంసీ అధికారి ఎస్.ఈ గోవింద రాజు జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు పెదగంట్యాడ

30-01-2025 20:20:57

హౌసింగ్ బోర్డు కాలనీ లో..పది కోట్ల రూపాయలతో పార్కు అభివృద్ధి
పార్కు పనులను పరిశీలించిన  జీవీఎంసీ అధికారి ఎస్.ఈ  గోవింద రాజు
జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు  
 పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30,
 జీవీఎంసీ 76వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుమారు నాలుగున్నర ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో పార్కు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పార్క్ నిర్మాణ పనులను సూపర్డెంట్ ఇంజనీర్ ( ఎస్.ఈ) గోవిందరాజు గురువారం నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు పనులను పరిశీలించి విద్యుత్ పనులను ప్రారంభించాలని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ ఏ.ఈ  వెంకట లక్ష్మీ సిబ్బందికి సూచించారు. జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటంతో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా విశాఖలో ఎన్నడలేని విధంగా పార్కు నిర్మాణ పనులు చేయబడుతున్నామని తెలిపారు. త్వరలో ఈ పార్కు పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. కార్య క్రమంలో ఈ.ఈ అప్పారావు, ఏ.ఈ వేంకటేశ్వర రావు  సిబ్బంది కాలనీ వాసులు మణి, రాజు, ధన, వంశీ తదితరులు పాల్గొన్నారు.