పదవ తరగతి విద్యార్థులకు దివిస్ స్టడీ మెటీరియల్.
తగరపువలస వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 30
ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి డిస్ట్రిక్ట్ కామన్ ఎంట్రన్స్ బోర్డు రూపొందించిన స్టడీ మెటీరియల్ దివిస్ సంస్థ పలు పాఠశాలలకు అందించారు. విశాఖ జిల్లా
అమనాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఏ ఆర్ విజయ కుమారి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు 34 మందికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు.ఈ స్టడీ మెటీరియల్ ఎస్ ఎస్ సి బోర్డు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఎంతగానో తోడ్పడతాయని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. సి ఎస్ ఆర్ ప్రతినిధి ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం ఈ స్టడీ మెటీరియల్ అనుసరించి చదివినట్లయితే 100% ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.