జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి
నివాళులర్పించిన జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు
పెదగంట్యాడ- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 30,
జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి కార్యక్రమాన్ని, 76వ వార్డు నడుపూరు గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నీవాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత ధర్మాన్ని పాటిస్తే దేనినైనా సాధించుకోవచ్చని, అదే ధోరణిలో స్వాతంత్రాన్ని సాధించుకునేందుకు మహాత్మా గాంధీ అమలు చేశారని అన్నారు. నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమంలో బొడ్డు కృష్ణా రావు, బెల్లాల నాగేశ్వర రావు, వెళ్లాలా పెంట బాబు, బొడ్డు వెంకటరావు, బొడ్డు సత్య రావు, వాసు, పిల్లి అప్పారావు, వెంకట రావు, దేవ ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.