మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం
ఎన్ ఏడి- వైజాగ్ ఎక్స్ప్రెస్. జనవరి 30: అనారోగ్య సమస్యలు వేధించడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధి బుచ్చిరాజుపాలెం లో చోటు చేసుకుంది.ఈ మేరకు ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవర సంజీవ్ (52)(అలియాస్ పైసలోడు ) భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలతో 90వ వార్డు బుచ్చిరాజుపాలెం గొల్ల వీధిలో అద్దె ఇంటిలో మూడవ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. కరాస దరి ఇసుక లోడింగ్ అన్ లోడింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీ మాదిరిగానే గురువారం పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేసాడు. భార్యను ఆకలి వేస్తుంది భోజనం పెట్టమని చెప్పడంతో భోజనం పెట్టింది తిని అది లోకి వెళ్లి పడుకుంటానని చెప్పాడు. గంట తర్వాత భార్య టీ పట్టుకుని గదిలోకి వెళ్ళేసరికి తలుపులు వేసి ఉండడంతో తోసినా రాకపోవడంతో కుమారుడని పిలవడంతో తన స్నేహితుని సహాయంతో తలుపులు తెరిచి చూసేసరికి డోర్ కర్టేన్ తో ఫ్యాను ఉక్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్నాడనుకొని కిందకు దించి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా సిబ్బంది కేజీహెచ్ కు తీసుకు వెళ్ళమని చెప్పడంతో హుటాహుటిన కేజీహెచ్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం దేహాన్ని మార్చురీకి తరలించారు. పనికి వెళ్లి వచ్చి కూలి డబ్బులు చేతిలో పెట్టి భోజనం చేసిన భర్త గంట లోపే విగత జీవిగా మారడంతో భార్య పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమని
కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. కూలి పని చేస్తూనే ఉన్నదాంట్లోనే పిల్లల్ని బాగా చదివిస్తూ ప్రయోజకులను చేస్తున్నాడు. భార్య దేవర లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.