పౌల్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం?
పి గన్నవరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గుబ్బల ప్రసాద్ అనే రైతు పౌల్ట్రీ పౌరం నిర్వహిస్తూ లాభాలు పొందుతు న్నాడు. పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహణలో అనేక మెలకువలు తెలుసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది, మేలు జాతి బ్రాయిలర్ కోళ్లు ఎంపిక చేసుకుని ఏ విధంగా సంరక్షించి లాభాలు పొందడంలో ఆదర్శ వ్యక్తిగా నిలుస్తున్నారు. అధికారులు ఇటువంటి ఆదర్శ రైతులను గుర్తించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించినట్లయితే నేటి యువరైతులు ప్రగతికి సోపానాలు అందించడం అవుతుంది. గుబ్బల ప్రసాద్, చిన్నతనం నుంచి కూడా పదిమందికి ఉపాధి కల్పించాలని ఆశయంతో అనేక చిన్న తరహా పరిశ్రమల నెలకొల్పటానికి కృషి చేశానని. నేడు పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతూ పలువురికి ఉపాధి అందించానేది నా తపన. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా అధికారులు తగిన ప్రోత్సాహం అందిస్తే పౌల్ట్రీ అభివృద్ధికి మరింత కృషి చేస్తాను అని అన్నారు.