36వ జాతీయ భద్రత మహోత్సవాల్లో ఎమ్మెల్యే తనయుడు
రావులపాలెం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
36వ జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా రావులపాలెం లోని సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీ స్కూల్ లో జాతీయ భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, బండారు సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన ప్రమాదాల నియంత్రణకు, ప్రజలంతా నిర్లక్ష్య ధోరణి వీడి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ధరించాలని అందరికీ సూచించారు. భద్రత మహోత్సవంలో భాగంగా రహదారి భద్రత ఒక సామాజిక బాధ్యత,రహదారి భద్రత నియమాలు పాటిద్దాం,
సురక్షితంగా ఇంటికి చేరుకుందాం,
నాకోసం నా కుటుంబం కోసం శ్రద్ధ వహిస్తాను, అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.