Sidebar


Welcome to Vizag Express
శ్వాస అందక పసికందు మృతి

30-01-2025 20:36:20

శ్వాస అందక పసికందు మృతి 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,30: పాడేరు కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో బుధవారం రాత్రి నాయకం ధనలక్ష్మి పురిటి నొప్పులతో డెలివరీ  అయింది. శ్వాస సంబంధిత సమస్య,  తీవ్రమైన జ్వరంతో గురువారం ఉదయం శిశువు చిన్నారి మృతి చెందింది. మండలంలోని వనుగుమ్మ పంచాయతీ కేంద్ర గ్రామానికి చెందిన నాయకం శుభన్ భార్య ధనలక్ష్మి లకు మొదటి కాన్పు 2023 జూలై 9న విశాఖ కే జి హెచ్ లో చిన్నారి ప్రసవించి అదే రోజు రాత్రి ఊపిరాడక శ్వాస సమస్యతో మృతి చెందింది. భర్త నాయకం సుభాన్ అందించిన వివరాల ప్రకారం  ధనలక్ష్మి 2023 జూలై 9న పురిటి నొప్పులు రావడంతో ముంచంగిపుట్టు మండల కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి విశాఖ కేజీహెచ్ కు తరలించగా అక్కడ డెలివరీ కాగా అదే రోజు రాత్రి శిశువు మృతి చెందిందని.. వైద్యులను ప్రశ్నించగా శ్వాస సంబంధించిన సమస్యతో చిన్నారి మృతిచెందని వైద్య సిబ్బంది చెప్పినట్లు ఆయన అన్నారు. అలాగే రెండవ కాన్పుగా పాడేరు ఏరియాస్పత్రిలో జనవరి29 2025 గురువారం రాత్రి చిన్నారి జన్మించి శ్వాస సంబంధిత సమస్య, రాత్రి అంతా తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారులను సంప్రదించగా పుట్టిన చిన్నారి ఏడవకపోవడం బ్రీతింగ్ సమస్యతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని ఆయన విలేకరులకు వద్ద వాపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఇద్దరు చిన్నారులు పుట్టినట్టే పుట్టి మృతి చెందడంతో భార్య ధనలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా రోధిస్తుండడంతో వారిని ఓదార్చడానికి బంధువులు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా  సుభాన్ ధనలక్ష్మి కుటుంబానికి ఇద్దరు చిన్నారులు పుట్టిన ఒక్కొక్క రోజే ఉండి మృతి చెందడం అది ఎవరికి అంత చిక్కటం లేదని పలువురు పేర్కొంటున్నారు.