Sidebar


Welcome to Vizag Express
అర్తం గ్రామంలో నాయి బ్రాహ్మణుల సర్వసభ్య సమావేశం

30-01-2025 20:37:34

అర్తం గ్రామంలో నాయి బ్రాహ్మణుల సర్వసభ్య సమావేశం 
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
 కొమరాడ మండలంలోని అర్తం గ్రామంలో కొమరాడ మండల నాయి బ్రాహ్మణ ప్రెసిడెంట్ భోగిల త్రినాధ, సెక్రటరీ కె. హేమ సుందర రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  నూతనంగా ఎంపిక కాబడిన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గండ్రేటి సత్యనారాయణ, మన్యం జిల్లా ప్రెసిడెంట్ పట్నాన రవి శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన గండ్రేటి  సత్యనారాయణ ను మండల నాయి బ్రాహ్మణ నాయకులు సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాకిచ్చిన ఈ పదవితో ఇంకా బాధ్యత పెరిగిందని మన అందరి సంక్షేమం కోసం ఎల్లవేళలా శ్రమించి మన సమస్యలను నెరవేరే దిశగా ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ డి. శ్రీను, రవి, సింహాచలం, సోము బాబు, మండల నాయి బ్రాహ్మణ సభ్యులు పాల్గొన్నారు.