Sidebar


Welcome to Vizag Express
పేకాట శిబిరం పై పోలీసులు దాడి

30-01-2025 20:38:45

పేకాట శిబిరం పై పోలీసులు దాడి 

 వీరఘట్టం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,

 జనవరి 30:

              వీరఘట్టం మండలం కొంచ గ్రామం శివారులో పేకాట ఆడుతున్నరని సమాచారం మేరకు వీరఘట్టం ఎస్సై కళాధర్ తన సిబ్బందితో కలిసి పేకాట ఆడుతున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల నుంచి 30 వేల నగదు తో పాటు మూడు బైకులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. మండలంలో ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమం లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై హెచ్చరించారు. గ్రామంలో ఇటువంటి కార్యక్రమంలు జరక్కుంటా పరివేక్షణ చేయాలని వీఆర్వో కి సూచించారు.