ఎమ్మెల్యే విజయ చంద్ర కు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు...
30-01-2025 20:40:00
ఎమ్మెల్యే విజయ చంద్ర కు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు...
సీతానగరం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 30 :
దావోస్ పర్యటన ముగించుకొని నియోజకవర్గానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్రకు పార్టీ శ్రేణులు, అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.పార్వతీపురం పట్టణం తో పాటు పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండలాల నుంచి నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు తండోపతండాలుగా వచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు . సీతానగరం మండలం ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభం వద్ద శ్రేణులు ఎమ్మెల్యేకు హారతులు ఇచ్చి పూలదండలేసి కుంకుమ దిద్ది జిల్లా కేంద్రానికి తోడుకొని వచ్చారు. అడుగడుగునా ప్రతి సెంటర్ వద్ద మహిళలు, కార్యకర్తలు, చిన్నారులు, పెద్దలు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఆయన వెంట కారులు, ద్విచక్ర వాహనాలు వందలాదిగా వచ్చాయి. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దావోస్ వెళ్లడం పార్వతీపురం ప్రాంత పేరు అక్కడ ప్రస్తావించే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిదన్నారు . రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ వివిధ కంపెనీలతో మాట్లాడి రండి చూడండి ఇష్టమైతే అనుకూలంగా ఉంటే పెట్టుబడులు పెట్టండి అని కొత్త విధానం చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రాంతం చూపించి మీకు అనుకూలంగా ఉంటే పరిశ్రమలో ఏర్పాటు చేయండి అని చెప్పిన విధానానికి ఎంతో మంది పెట్టుబడిదారులు ఆకర్షితులై ముందుకు వచ్చారని ఎమ్మెల్యే అన్నారు. అదే తరుణంలో ఎక్కడికెళ్లినా దావోస్ లో ఏ సందర్భంలో మాట్లాడిన పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అని ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఫీలయ్యానని ఈ ప్రాంతం పేరును దావోస్ లో వినిపించేలా వచ్చిన అవకాశం, అందుకు సహకరించిన ముఖ్యమంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపానన్నారు.ఇటువంటి అవకాశాలు ఎప్పుడో గాని రావని అందులో మారుమూల ప్రాంతానికి చెందిన పార్వతీపురం నియోజకవర్గం తనకు దక్కడం అదృష్టం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి,నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం , తను చిత్త శుద్ధితో పనిచేస్తున్నామని మంచి మెరుగైన ఫలితాలు రానున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగభూషణం.టెంటు అప్పలనాయుడు. రౌతు వేణుగోపాల్ నాయుడు.పెంట సత్యం నాయుడు.కంకణపల్లి అరవింద్. బొమ్ము నాయిని లక్ష్లక్ష్మణరావు. సబ్బన శ్రీనివాస్. గునుపూరు అన్నం నాయుడు. గొట్టాపు అప్పారావు. కొల్లి సురేషు. తేలు చంద్రశేఖర రావు తో పాటు అభిమానులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు