అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల వద్ద గుంతలను పూడ్చిన చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31:
అనకాపల్లి జిల్లాగొలుగొండ మండలం చోద్యం సర్పంచ్ ఆదపురెడ్డి గోపాల కృష్ణ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తన సొంత నిధులతో నర్సీపట్నం నుండి కృష్ణదేవపేట వెళ్లే ఆరిలోవ అటవీ ప్రాంతంలో అసంతృప్తి గా మిగిలి ఉన్న కల్వర్టు గోతులు లో గ్రావెల్ వేసి గోతులు పూడ్చారు. ప్రయాణీకులు సౌకర్యార్థం ఇబ్బందులు పడకుండా రోడ్డు సౌకర్యం కల్పించారు. దీనిపై ప్రయాణికులు. ప్రజలుహర్షం వ్యక్తం చేసి వారికి ధన్యవాదాలు తెలియజేశారు