పద్మనాభ నగర్ పాఠశాలకు ప్లేట్లు కుర్చీలు వితరణ
ఎన్ఏడి -వైజాగ్ ఎక్స్ప్రెస్. ఫిబ్రవరి 1: జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గ 92 వ వార్డు, పద్మనాభ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు రాష్ట్ర యువశక్తి అవార్డు గ్రహీత నందవరపు సోములు చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు 50 ప్లేట్లు కుర్చీలు , ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. ఈ మేరకు నందవరపు సోములు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉంటారు వారికి అవసరమగు పుస్తకాలు, ఇతర సామాగ్రి కూడా అందించుటలో అలాగే పాఠశాలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులకు కావలసిన సదుపాయాల్ని సమకూర్చాలని అన్నారు, అంతేకాకుండా కొన్ని స్థానిక స్వచ్ఛంద సంఘాలు ముందుకు రావాలని అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు .ఉమారాణి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్ని సమకూర్చినప్పటికీ ఇంకా అనేకమైనవి అవసరం ఉంటాయని మరి కొంతమంది దాతల సహాయం వలన పాఠశాలకు ఇబ్బందులు లేకుండా ఉంటున్నాయని ఆనందం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలకు కుర్చీలు ,ప్లేట్లు అందజేసిన బలివాడ రామకుమారి, బలివాడ ప్రసన్నకి ఈ సందర్భంగా సోములు అభినందనలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ,జనతా మహిళా సేవా సంఘం అధ్యక్షురాలు ఎం. విమల, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.