అరకు చలి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్
01-02-2025 17:36:13
అరకు చలి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్
అరకు/ పాడేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 31: అరకు చలి ఉత్సవాలలో ప్రధాన వేదిక డిగ్రీ కళాశాల మైదానంలో స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ఈ స్టాల్స్ ను ప్రత్యేకంగా ప్రారంభించి అందరిని ఆకట్టుకున్నారు. సాధారణంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడానికి బదులుగా తుడుము వాయించి, ఉట్టిలో ధాన్యం, నీరు పోసి వడ్లు దంచి స్టాల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో స్టాల్ ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం ఏర్పాటుచేసిన స్టార్స్ అన్ని కలియదరికి ఆయా వస్తువులను. స్థానిక స్టాల్స్ తో పాటు వివిధ రాష్ట్రాల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి. సార్ గిరిజనులు నాచురల్ పెయింట్స్, బీడ్ వర్క్స్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఊటీ గిరిజనులు ఎంబ్రాయిడరీ స్టాల్ ను, నాగాలాండ్ గిరిజనులు స్వెటర్ స్టాల్ ను, మణిపూర్ గిరిజనులు పూసల దండల స్టాల్ ను, రాజస్థాన్ గిరిజనులు గాజుల స్టాల్, చతీష్ గడ్ రాష్ట్ర గిరిజనులు మల్టీ మెటల్ స్టాల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీతంపేట, రంపచోడవరం, పాడేరు ఐ టి డి ఏ లు ఏర్పాటుచేసిన వన్ దన్ కేంద్రాలు, హుకుంపేట, అరకు, మండలాల గిరిజనులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. చోంపి గిరిజనులు ఏర్పాటు చేసిన లక్క బొమ్మలు, మాడగడ గిరిజనులు ఏర్పాటుచేసిన మట్టి బొమ్మలు స్టాళ్లతో పాటు కుండలు తయారుచేసే లైవ్ స్టాల్ మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కాఫీ టెక్నో సర్వ్ స్టాల్ ఏర్పాటు చేశారు. వంజంగి గిరిజనులు ఆదివాసి సంస్కృతి పై స్టాల్ ని, నెల్లూరు గిరిజనులు చీరలు హెయిర్ బ్యా0డ్స్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఏపీ టీడీసీ, జిసిసి, అటవీ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు.