Sidebar


Welcome to Vizag Express
రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది-సీఎం రమేష్ -వికసిత్ భారత్ బడ్జెట్ పై స్పందన

01-02-2025 17:47:20

రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది-సీఎం రమేష్
-వికసిత్ భారత్ బడ్జెట్ పై స్పందన 
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1:
2025-26 ఆర్థిక బడ్జెట్‍లో కేటాయింపులు మీద అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ఒక ప్రకటనలో స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజల బడ్జెట్‌ అని,రూ.140 కోట్ల ప్రజల ఆశలు నెరవేరుస్తూ, నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్ అని ప్రత్యేకంగా కొనియాడారు.రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్నుమినహాయింపు ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభించిందని పేర్కొన్నారు.శనివారం ప్రకటించిన బడ్జెట్ కంటే ముందుగా గత ఏడు నెలల్లో కేంద్రం నుంచి  ఏపీలో వివిధ ప్రాజెక్టులకు వచ్చిన నిధులు గురించి ప్రస్తావిస్తూ అమరావతికి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‍కి రూ.11,440 కోట్లు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కి రూ.14 వేల కోట్లు,వెనుకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు,గ్రీన్ హైడ్రోజన్ హబ్‍కు రూ.1.8 లక్షల కోట్లు,పోలవరం ప్రాజెక్టుకు రూ.2800 కోట్లు,పారిశ్రామిక కారిడార్లకు రూ.4936 కోట్లు, బీపీసీఎల్ రిఫైనరీకి రూ.95 వేల కోట్లు కేటాయింపులకు గాను రాష్ట్ర ప్రజలు తరుపున ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం తరుపున కేంద్ర ప్రభుత్వంకు ధన్యవాదములు తెలియజేస్తునట్లు తెలిపారు.నేడు ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్ రూ. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మధ్య తరగతికి అతి పెద్ద గిఫ్ట్ ఇచ్చింది అని రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు చారిత్రాత్మక నిర్ణయం అని మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా, దేశీయ వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టుకు,విశాఖ పోర్టుకు,జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‍కి నిధులు పెంపు మీద ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్ర ఆర్యోగ వ్యవస్థల బలోపేతానికి  కొత్తగా కేటాయించండం పోలవరం ప్రాజెక్టుకు,విశాఖ స్టీల్‍కు, విశాఖ పోర్టుకు,రోడ్లు,వంతెనల ప్రాజెక్టులకు ఇలా అత్యధిక కేటాయింపులు పట్ల కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి,నిర్మల సీతారామన్ లకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.