ఇది వికసిత భారత బడ్జెట్
బిజెపి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్. ఫిబ్రవరి 1
పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ వికసిత బడ్జెట్ అని
భారతీయ జనతా పార్టీ రాజాం నియోజకవర్గం సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు అన్నారు.శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ అద్భుతం గా ఉందన్నారు.ఈ బడ్జెట్ లో పేదలు, యువత, అన్నదాత, నారీశక్తి ఈ నాలుగు రంగాలను మూల స్తంభాలుగా చేసుకొని బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. 2047 నాటికి భారత్ దేశాన్ని ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలబెట్టటమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతుందన్నారు.