Sidebar


Welcome to Vizag Express
పెన్షన్ల పంపిణీలో కొన్ని ఆంక్షలు

01-02-2025 21:56:55

పెన్షన్ల పంపిణీలో కొన్ని ఆంక్షలు

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 1:

మండలములో గల ఆంపురం,యం.యస్.పల్లి,కొల్లూరు, నారాయణ బట్టి, రేఖాదేవిపురం, ముండల, సవర గోవింధపురం, జె.జిల్లుండ గ్రామాలలో వి.తిరుమల రావు,యం.పి.డి. ఓ.  సందర్శించి పెన్షన్ పంపిణీని ఆకస్మిక తనిఖీ చేశారు. పెన్షన్లు పంపిణీ చేస్తున్న వారి వారి పనితీరును పరిశీలిస్తూ కొన్ని ట్యూషన్లు చేశారు.  ఈ నెల నుండి పెన్షన్ దారుల ఇల్ల యొక్క జియో కోర్డినెట్స్ (అక్షంశాలు మరియు రేఖాంశాలు) సరిపోతే మాత్రమే పెన్షన్ పంపిణీని జరుగుతున్నదని దీనిని జీవనోపాధి పై ఇతర ప్రాంతాలలో నివసిస్తూ ప్రతీ నెల సొంత ఇల్లలో పెన్షన్ పొందుతున్న పెన్షన్ దారులు పై విషయన్ని గమనించాలని,ఇందువలన ఈ రోజు ఉదయం కాస్త నెమ్మదిగా పెన్షన్ పంపిణీ జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.