అనుమానంతో హత్య
నిందితున్ని అరెస్టుచేశాం..
కాశీబుగ్గ డిఎస్పి వెంకట అప్పారావు..
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ఫిబ్రవరి 1:
స్నేహంగా ఉంటూ
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కక్షకట్టి పథకం ప్రకారమే సవర జాన్ తన స్నేహితుడైన అమిట శ్రీనును హత్య చేశాడని కాశీబుగ్గ డిఎస్పి వెంకట అప్పారావు వెల్లడించారు. ఈమేరకు శనివారం స్థానిక కాశీబుగ్గ పోలీస్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడ్ని మీడీయాకు ఎదుట ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరజాన్ ఇమిటి, శ్రీనివాసులు కాశీబుగ్గ ఇండస్ట్రియల్ ఏరియాలో ని జీడి పరిశ్రమలో పనిచేస్తుండేవారని శ్రీను పలుమార్లు జాన్ ఇంటికి అవసరం లేకుండా రావడం తన భార్యతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడని, అది కాస్త అక్రమ సంబంధం గా మారిందన్న అనుమానంతో జాన్ ఇమిట శ్రీనును హత్య చేశాడని డీఎస్పీ వెల్లడించారు. శ్రీనును ఎలాగైనా హత్య చేయాలని భావించి పథకం ప్రకారమే ఈ చర్యకు జాన్ పాల్పడ్డాడని డి.ఎస్.పి తెలిపారు. గత నెల 21 సాయంకాలం 3 గంటల సమయంలో శ్రీను ఇంటికి జాన్ వెల్లాడని తెలిపారు. ఇద్దరు కలిపి కోసంగిపురం వద్దకు వెళ్లి అక్కడ ఇద్దరు మద్యం సేవించినట్టు వెల్లడించారు. తిరిగి కాశీబుగ్గ వెళ్తుండగా సబ్ స్టేషన్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద ఇనప రోడ్డుతో శ్రీను తలపైజాన్ బలంగా కొట్టాడని, దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అనంతరం మృతుడు భార్య పోలీసులకు పిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో జాన్ విషయం తెలుసుకొని జాన్ కోసంగి పురము విఆర్ఓ వద్ద జాన్ లొంగిపోయాడని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కాశీబుగ్గ సిఐ ,పి సూర్యనారాయణలు ఉన్నారు.