తూనికల కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,01: గిరిజన రైతులపై అపరాల వ్యాపారస్తులు, కిరాణా దుకాణాల వ్యాపారస్తులు, చేస్తున్న మోసాలపై తూనికల కొలతల అధికారులు కొరడా జులిపించారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో తూనికల కొలతల అధికారులు విశాఖపట్నం డిప్యూటీ కంట్రోలర్ కేటి రవికుమార్, అనకాపల్లి అసిస్టెంట్ కంట్రోలర్ బి రామచంద్రయ్య ల ఆధ్వర్యంలో వారపు సంతలో, కిరాణా షాపులు, బంగారపు షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు మండల కేంద్రం గిరిజన సహకార సంస్థ గోదాము ఎదుట మండలానికి చెందిన వివిధ గ్రామాల అపరాల వ్యాపారస్తులు రైతుల నుండి దినుసులు కొనేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రికల్ కాటాల తూకల్లో మోసాలపై తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ కాటా లో మోసాలకు పాల్పడిన ముగ్గురు అపారాల వ్యాపారస్తులు ఒక్కొక్కరిపై 5000 చొప్పున జరిమానా విధించింది ప్రభుత్వం నిబంధనల ప్రకారం సీలు లేని రెండు కాటాలకు సీలు జర మన విధించారు
10 కేజీల తూకం గుండును ఎలక్ట్రికల్ కాటాలో తూకం వేసి పరిశీలించగా ఒక కేజీ తూకం తక్కువగా రావడంతో ఎలక్ట్రికల్ కాటాల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీ ధరల కన్నా అధికంగా విక్రయిస్తున్న రెండు పాల పేకట్ల దుకాణ యజమానులకు జరిమాన విధించారు. ఇది ఇలా ఉండగా మండల కేంద్రంలో ఉన్న బంగారం షాపులో కొనుగోలుదారుల పై అధిక వసూలు చేయడం, బిల్లులో అధిక మొత్తం డబ్బులు చూపించటంపై కొనుగోలుదారులపై వసూలు చేయడం పై తూనికల కొలతల అధికారులు అసహనం వ్యక్తం చేశారు.గిరిజన రైతులకు, ప్రజలకు వ్యాపారస్తులు మోసాలు చేస్తే వారిపై కేసు నమోదు చేసి అధిక మొత్తంలో జరిమాన విధిస్తామని వారు వ్యాపారస్తులకు హెచ్చరించారు. అపారల వ్యాపారస్తులు, కిరాణా దుకాణాల వ్యాపారస్తులు కానీ ఇలాంటి మోసాలకు పాల్పడితే సదరు యాజమానులపై కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సిటీ తూనికల కొలతల ఇన్స్పెక్టర్ వి రామారావు, సిబ్బంది, గిరిజన రైతులు, తదితరులు పాల్గొన్నారు.